Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారేపల్లి శేఖర్‌రావు
నవతెలంగాణ- నేరేడుచర్ల
ఐకెపి కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు కోరారు.గురువారం మండలకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలలో దాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు రోడ్లమీద దాన్యం ఆరబెట్టుకోవడం లాంటి సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, ఐకేపీ కేంద్రానికి వచ్చే దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.ప్రస్తుత వానాకాలంలో ఆయకట్టులో వరి ధాన్యం పండించారని, పండిన పంటకు గిట్టుబాటు ధర కనీసం 2500 ఇవ్వాలని ఐకెపి కాంటాల్లో ,ధర్మకాంటాలలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే యాసంగి సీజన్ కి రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై సహకార సంఘాల ద్వారా రైతులకు అందించాలని కోరారు. ఎస్కె. ఆఫీస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి కోదమగుండ్ల నగేష్, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, పట్టణ కమిటీ సభ్యులు కుంకు తిరుపతయ్య, కొండపల్లి వరలక్ష్మి ,నీలా రామ్మూర్తి ,సట్టు శీను, ఎడ్ల సైదులు పాల్గొన్నారు.