Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- కేరళ తరహాలో రైతులకు మద్దతు ధర ఇవ్వాలి
- రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
- నవతెలంగాణ తో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
నవతెలంగాణ -మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగించిన రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు. రేపటినుండి నల్గొండలో జరిగే రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభల సందర్భంగా శుక్రవారం ఆయన నవతెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే....
1936లో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ జాతీయోద్యమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, జమీందారీ, జాగిర్దారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమరశీలంగా పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించింది. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు, 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వివిధ రైతు సంఘాలతో కలిసి తెలంగాణ రైతు సంఘం ఐక్య ఉద్యమాన్ని నిర్వహిస్తున్నది. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి. రైతుల రుణాలన్నిటిని ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు.. పంటల బీమా పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చి రూపొందించాలి. ప్రాజెక్టులు, పరిశ్రమలలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని చెప్పి ఇప్పుడు మళ్లీ అమలుకు ప్రయత్నాలు చేస్తోంది. చిన్న, సన్న కారు రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. అని పంటలకు మద్దతు నిర్ణయించాలని, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేరళ ప్రభుత్వం తరహా పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, అక్కడి రైతులకు వర్తించే విధంగా ఇక్కడ అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి రుణ అర్ధ కార్డులు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. రాష్ట్రంలో 13.50 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. సుమారు 3లక్షలా 50 వేల మంది రైతులు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నారు. వీరందరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాలి. సర్వే పారదర్శకంగా నిర్వహించి ఆరో నెల వారందరికీ పత్రాలు ఇవ్వాలి. సర్వే గడువును డిసెంబర్ 15 వరకు పెంచాలి.
రేపటి నుంచి రాష్ట్ర మహాసభలు
ఈనెల 27, 28, 29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు నిర్వహిస్తున్నాం. మొదటి రోజు 27వ తేదీన ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది. ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు మేకల అభినవ్ స్టేడియం నుండి ఎన్జీ కాలేజీ గ్రౌండ్ వరకు మహా ప్రదర్శన ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో సుమారు 25 వేల మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తాం 28, 29 తేదీలలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నగర్, మాలి పురుషోత్తం రెడ్డి గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో(ఏచూరి గార్డెన్) ప్రతినిధుల సభ ఉంటుంది. రాష్ట్ర నలుమూల నుండి సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ దావలె, ప్రధాన కార్యదర్శి హన్నాన్ మొల్ల, డా. విజ్జు కష్ణన్, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరుకానున్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలి.