Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలలైనా అందని జీతాలు
- ఇబ్బందుల్లో కార్మికులు
నవతెలంగాణ -మునుగోడు
మునుగోడు మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉండగా ఆ గ్రామ పంచాయతీల్లో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికులు 109 మంది మల్టీపర్పస్ వర్కర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ.8500 జీతం చొప్పున ప్రతినెల మొదటి వారంలోపు జీతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ గత నాలుగు నెలలుగా గ్రామపంచాయతీలలో నిధులు లేకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది . కార్మికులు తమ కుటుంబ అవసరాల కోసం గ్రామస్తులు , వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తెచ్చుకుని జీవనం నెట్టుకొస్తున్నామని గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామపంచాయతీలకు నాలుగు నెలలుగా కేంద్ర రాష్ట్ర నిధులు గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు కాకపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వడానికి పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకునేందుకు కార్యదర్శులు ఇబ్బందికి గురవుతున్నారు . ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణ విడుదల చేయాలని గ్రామపంచాయతీ కార్మికులు కోరుకుంటున్నారు
జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..
ఎర్ర అరుణ,చీకటి మామిడి గ్రామపంచాయతీ కార్మికురాలు..
నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం నెల అంత కష్టపడితే వచ్చే ఎనిమిది వేల జీతంతో కుటుంబ పోషణ గడిచే పరిస్థితి కానీ ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడం కూడా కష్టంగా మారింది జిల్లా అధికారులు స్పందించి జీతాలను అందించాలి
నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలి...
ఎన్.పెద్దమ్మ, మునుగోడు గ్రామపంచాయతీ కార్మికురాలు ..
నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాం . ప్రతి నెల గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చే 8500 జీతం నెల మొదటి వారంలో ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా అవసరాలకు ఉపయోగపడతాయి కానీ నాలుగు నెలల నుంచి రాకపోవడంతో కార్మికులమంత ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం
పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలి
వరికుప్పల ముత్యాలు, సీఐటీయూ మండల కన్వీనర్ మునుగోడు
రెక్కడితే తప్ప డొక్కా నిండని నిరుపేద గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల చెల్లించాల్సిన జీతాలు నెల నెల చెల్లించకపోవడంతో గత నాలుగు నెలలుగా పస్తులతో గ్రామపంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలను విడుదల చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామపంచాయతీ కార్మికులతో సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తాం .
త్వరలోనే జీతాలు అందజేస్తాం
సుమలత మునుగోడు ఎంపీఓ
గ్రామ పంచాయతీలలో నిధులు లేకపోవడం వలన గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది . ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు వచ్చిన వెంటనే జీతాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం.