Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
నవంబర్ 27 ఎన్జీ కాలేజీలో జరిగే రైతు బహిరంగ సభ లో కార్మిక వర్గం పాల్గొని కార్మిక, కర్షక మైత్రి చాటాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 27,28,29 తేదీలలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు పట్టణంలో జరుగుతున్నాయని ఆ సందర్భంగా 27న మేకల అభినవ స్టేడియం నుండి ఎన్జీ కళాశాల వరకు భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక, కర్షక మైత్రిని చాటాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ మొదటి వారంలో మున్సిపల్, కలెక్టరేట్ ల ముందు ధర్నా లు చేస్తామని హెచ్చరించారు.
సీఐటీయూలో చేరిక
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్లో వివిధ యూనియన్ ల లో పనిచేస్తున్న కార్మికులు సీఐటీయూలో జీడిమెట్ల నరసింహ , కత్తుల సావిత్రమ్మ ల ఆధ్వర్యంలో చేరారు. సీఐటీయూరాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల చేస్తున్న పోరాటాలు నచ్చి సంతోషంతో సిఐటియులో చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, జిల్లా కోశాధికారి గుండ్లమల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పెరిక అంజమ్మ , పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పెరిక కృష్ణ ,పందుల లింగయ్య, ఇస్రము పాండు, దాసారపు రమేష్, మాచర్ల సైదులు, కత్తుల పద్మ, శ్రీదేవి, పెరిక బిక్షం, వెంకన్న, దండు శ్రీను,చిక్కుల రాములు, జక్కల నర్సింహ పాల్గొన్నారు.