Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజులపాటు నిర్వహణ
- సభల జయప్రదానికి కృషి చేయాలి
- మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలో నవంబర్ 27 28 29 తేదీల్లో యాదగిరి గుట్ట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు, సభలను జయప్రదం చేసేందుకు కార్మిక వర్గం కృషి చేయాలని ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి కోరారు.శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 27 28 29 మూడు రోజులు సభలు జరుగుతాయి అన్నారు.మొదటి రోజు పట్టణంలోని సన్నిధి హౌటల్ నుండి కార్మిక మహా ప్రదర్శన ఉంటుందన్నారు.బస్టాండ్ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.రెండు మూడు రోజుల్లో సభ లో తీర్మానాలు ఉంటాయని ఆయన వివరించారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి ప్రాధాన్యతిస్తుందని విమర్శించారు.బడా బాబులకు చెందిన 10 లక్షల కోట్లు అప్పు రద్దు చేయడం దారుణం అన్నారు.తాము పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటున్నామని అదేవిధంగా కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత పాలకులపై ఉందన్నారు.దేశంలో అసంఘటితరంగా కార్మికుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ బాలరాజు విఎస్ బోస్ లు మాట్లాడుతూ దేశ ప్రధాని కార్మిక ద్రోహిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి యూసుఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు,సహయ కార్య దర్శి బోలగాని సత్యనారాయణ వై దామోదర్ రెడ్డి, సీపీఐ నాయకులు ఏషాల అశోక్,చెక్క వెంకటేష్ ,బండి జంగమ్మ, కల్లేం కృష్ణ,గోరేటి రాములు,ఎండి ఇమ్రాన్ ,పేరబోయిన మహేందర్ ,బబ్బురి శ్రీధర్ , రాజయ్య, పేరబోయిన బంగారు పాల్గొన్నారు.