Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- బొమ్మలరామారం
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి మల్లేశం విద్యార్థులతో సమావేశం అయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..నూతన విద్యా విధానం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతురన్నారు. విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ కాషాయకరణం చేయడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల్లో పూర్తిగా మతతత్వ భావాజాలను నింపుతారని తెలిపారు. ,మతతత్వ విద్యాసాలు రెచ్చగొట్టే విధంగా నూతన విద్యా విధానం రూపొందించారన్నారు. విద్యా విధానం రద్దు చేసే పోరాటాల్లో ప్రజలు విద్యార్థులు అందరూ కలిసి నూతన విద్యా విధానం వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడీయ రాజు, కళాశాల కమిటీ సభ్యులు అఖిల్ యశ్వంత్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.