Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం దేశానికి పెనుప్రమాదమని, నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుచేస్తే విద్యారంగానికి నష్టం వాటిల్లుతుందని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం డిసెంబర్ 13 నుండి 16 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా ఇమాంపేట మోడల్ కళాశాలలో 'నూతన జాతీయ విద్యా విధానం- ఒక పరిశీలన' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు.ఈ విధానంలో విద్యాహక్కు చట్టం స్ఫూర్తి లేదన్నారు.ఈ విద్యావిధానాన్ని అమలుచేస్తే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతుందన్నారు.పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. యోగా, జ్యోతిష్యం,సంస్కతం పేరుతో ఆశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థుల్లో జోప్పించే ప్రయత్నం జరుగు తుందన్నారు.ఈ విద్యా విధానంలో రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.విదేశీ యూనివర్సిటీలు దేశంలోకి ఆహ్వానించబడతాయని,తద్వారా పెద్దఎత్తున విద్యావ్యాపారం జరుగుతుందన్నారు. కుల, మత ప్రాంతీయ బేధాలు లేని అసమానతలు లేని విద్యావిధానం కావాలన్నారు.ఈ పాలసీ లో దేశ జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలనడం మంచి పరిణామమే అయినప్పటికీ అమలు చేయాలన్నారు.విద్యార్థులు ఈ విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం చేసి సవరణలు మార్పుల కోసం ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జిల్లా అధ్యక్షులు బానోత్ వినోద్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శంకర్‌నాయక్, సుమన్, అరుణ్, వినరు, శివ, అజరు పాల్గొన్నారు.