Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మండలపరిధిలోని బరాకత్‌గూడెంలో గల ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి డి.రామారావునాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలుకేంద్రాలకు తీసుకురావాలన్నారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాణోత్ అనిల్‌కుమార్,వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్కె.ముస్తఫా, సుందర్, గిరి, రైతులు నాగరాజు, నర్సయ్య పాల్గొన్నారు.
కోదాడరూరల్ :వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.రామారావునాయక్ అన్నారు.శుక్రవారం మండలంలోని గుడిబండ, ద్వారకుంట గ్రామంలోని ధాన్యం కొనుగోలుకేంద్రాలను సందర్శించి ఆయన మాట్లాడారు. రైతులు వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని, అలాగే ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు టి.వాసు, మండల వ్యవసాయ అధికారిణి పి.రజిని,వ్యవసాయ విస్తరణ అధికారులు మహేష్, సల్మా,ఝాన్సీ, సీఈవో జొన్నలగడ్డ కృష్ణ, ధాన్యం కొనుగోలుకేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.