Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని బంకాపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు రూ.21 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, శ్మశానవాటికను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమైక్య రాష్ట్రం లో వెనకబాటుకు గురైన రాష్ట్రాన్ని నేడు ప్రత్యేక తెలంగాణ తర్వాత బంగారు తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.పేదప్రజల సంక్షేమం కోసం గ్రామాలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఇప్పటికే అనేక రంగాలను ఆర్థికాభివృద్ధిలో ముందుంచామని తెలిపారు.పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు.దామరచర్ల పవర్ ప్రాజెక్ట్ పనులను అడ్డుకునేందుకు శక్తియుక్తులను బీజేపీ ప్రయత్నం చేస్తుందని తెలిపారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.అనంతరం పంచాయతీ నిర్మాణానికి స్థలాన్ని దానం చేసిన పంపాటి యాదయ్య దంపతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోములభగత్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి,ఎంపీపీ బొల్లం జయమ్మ, జెడ్పీ వైస్‌చైర్మెన్ ఇరిగి పెద్దులు, జెడ్పీటీసీ రామేశ్వరి, కేవీ.రామారావు,రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్‌యాదవ్,సర్పంచ్ ఉన్నం శోభ సత్యనారాయణ పాల్గొన్నారు.