Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సబ్ జూనియర్-14, ,జూనియర్ అథ్లెటిక్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీట్ -16ఏండ్ల వరకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ప్రతిభ చూపిన బాల బాలికలను సబ్ జూనియర్ విభాగంలో డిసెంబర్ 5 , 6 తేదీలలో గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు , జూనియర్ విభాగంలో 2023 జనవరి 12 నుండి 14 వరకు పాట్నాలో జరుగు జాతీయస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుండి 350 మంది క్రీడాకారులు 50 మంది వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు హాజరయ్యారు. విజేతలకు నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలాపొగుల స్వాములు మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ , జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి వినోద్, అజరు కుమార్, ఎర్ర యాదగిరి, వ్యాయమ విద్యా ఉపాధ్యాయులు రఘువీర్ సింగ్, చంద్రమౌళి, కవిత , సుందరి, జ్యోతి, కవిత, బాలాజీ, సునీల్, పవన్, సాయి, వెంకట్, ఉత్తేజ్, రమేష్, రాకేష్, భాస్కర్, బిట్టు, సింధు, సచిన్ సాయికిరణ్, నవీన్,తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు...
నవీన్, గణేష్, హథీరాం, నవదీప్ చక్రవర్తి, సాయికుమార్,చందు, అర్చన, తేజేస్వి, జ్యోతిర్మయి, భూపాల్ , అలేఖ్య, విషువర్ధన్, శ్రీనిది ఎంపికయ్యారు.