Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ- ఆలేరు రూరల్
నార్ముల్ మదర్ డెయిరీసంస్థలో ఉద్యోగుల పై చర్యల విషయంలో మదర్ డైరీ యాజమాన్యం మనవాడైతే ఒక విధంగా లేకుంటే మరో విధంగా ముందుకు వెళుతుందనిని శారజిపేట పాల సెంటర్ చైర్మెన్ బత్తుల నరేందర్ రెడ్డి ఆరోపించారు.ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ . ఇటీవల తుర్కపల్లి లో జరిగిన అవినీతి కుంభకోణంలో బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు. అదే శైలిలో అంతకన్నా భారీ కుంభకోణం జరిగిన మోత్కూర్ పాల కేంద్రం లో మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సిబ్బందిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. భువనగిరి పాల కేంద్రంలో జరిగిన నష్టానికి నామమాత్రపు పెనాల్టీలు వేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. రఘునాథపురం పాల కేంద్రం మేనేజర్ తీరే వేరు. ఆ పాల కేంద్ర పరిధిలోని కాచారం పాల సంఘం ఈ సంవత్సరం మే నెలలో అందులోని సభ్యులంతా పూర్తిగా శక్తి అనే ప్రయివేటు డెయిరీ డైవర్ట్ కావడం జరిగింది అన్నారు. మే నెలలో డైవర్ట్ అయిన కాచారం సంఘానికి అక్కడ ఉన్న మేనేజర్ జూన్ లో ఎన్నికలు జరిగినట్టు, అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు ఎన్నికైనట్టు రికార్డులు తయారుచేసి డెయిరీలో ఓటు హక్కు కల్పించారన్నారు. ఇది ఏమిటని మదర్ డెయిరీ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎండి డిజిఎం తో సహా పై స్థాయి అధికారులకు పాల కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి దందాల నుండి ముడుపులు ముడుతున్నాయి అన్నారు. నెలవారి మామూళ్ల కోసమే ఫీల్డ్ విజిట్ చేయడం తప్ప ఆ పాల కేంద్రాలలో అసలు పాలు సరఫరా చేస్తున్న కేంద్రాలు ఎన్ని, బినామీ సెంటర్లు ఎన్ని అనేవి తెలువదన్నారు. రఘునాథపురం మేనేజర్ని సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.