Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మూడు తరాల ఉద్యమాలకు నాయకత్వం వహించిన జైని మల్లయ్య గుప్త జీవితం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాయని నందిని సిధ్ధారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక హన్మాన్ వాడ లో గల ప్రజా పాఠశాల ఆవరణలో జరిగిన జైని మల్లయ్య గుప్త మిత్రుల ఆత్మీయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. తొమ్మిది దశాబ్దాల పాటు చరిత్రను కల్గి ఉండడం తో పాటు ఒకే అభిప్రాయం కల్గి ఉండడం జైని మల్లయ్య గుప్త క సాధ్యమైందన్నారు. ఆంధ్రమహాసభ లో చురుకుగా పాల్గొన్న మల్లయ్య గుప్తను, ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ రెండేండ్లు జైలు జీవితం గడిపానని,ఆ తర్వాత జైలు నుండి తప్పించుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్లానని తెలిపారు. ఆయన్ను పలువురు ప్రముఖులు సన్మానించారు. శ్రీనివాసా చార్యులు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, వేణు సంకోజు, మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ రెడ్డి, బట్టు రామచంద్రయ్య, కొలుపుల అమరేందర్, జిట్టాబాల కృష్ణారెడ్డి ,శేక్ హమీద్ పాషా,కాచరాజు జయప్రకాష్, కొడారి వెంకటేష్, జిట్టా భాస్కర్ రెడ్డి, గడ్డం నర్సింహా రెడ్డి, పాలకుర్తి రాంమూర్తి, భాస్కర్,సామ మల్లారెడ్డి, ఎండి.అతహర్, బండారు జయశ్రీ,సోమ సీతారాములు, జైని రవీందర్, భీమార్జన్ రెడ్డి, నర్సింహ్హరావు, బెల్లి కృష్ణ, రావుల రాజు, తంగళ్ళపల్లి రవికుమార్, మేధావులు పాల్గొన్నారు.