Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు సీపీఐ(ఎం) కౌన్సిలర్ల వినతి
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని జయశ్రీ గార్డెన్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్‌గౌడ్, కౌన్సిలర్ దండ హిమబిందుఅరుణ్కుమార్ల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కేంద్రంలోని పెద్దచెరువు అలుగు కాల్వ చేసి నీరు సాఫీగా వెళ్లే విధంగా డ్రయినేజీ ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని, ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు పూర్తిచేయాలని, వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని, గాంధీపార్కును అభివద్ధి చేయాలని, మినీ ట్యాంక్‌బండ్ పూర్తిచేయాలని, కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరుచేయాలని కోరారు. గ్రామకంఠంలోని ఇండ్ల మ్యూటేషన్ వారి వారసుల పేర్ల మీద మార్చాలని, ఇండ్లపై ఉన్న 11కేవీ వైర్లను తొలగించాలని, లోఓల్టేజీ కరెంట్ ఉన్న చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుచేయాలని, హైవే వెంట సర్వీసు రోడ్లను పూర్తిచేయాలని, 10వ వార్డులో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ను పూర్తిచేయాలని, వక్ఫ్ బోర్డు గెజిట్‌లో గట్టుప్పల్‌కు బదులుగా చౌటుప్పల్ అని వచ్చిందని, దానిని వెంటనే తొలగించాలని, తంగడపల్లి రోడ్డు నుండి మల్లిఖార్జున స్కూల్ వరకు పెద్దకాల్వ డ్రయినేజీ నిర్మాణం చేపట్టాలని, నాగులకుంట సుందరీకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యేను కోరారు.