Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయిలో కార్యకర్తలంతా సమిష్టి కృషితో పని చేయాలని మోత్కూర్ మార్కెట్ చైర్మెన్కొణతం యాకూబ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ కోరారు. మోత్కూర్ మండలం ముశిపట్ల, పాలడుగు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో బూత్ కమిటీలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీమారయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు నేర్లకంటి మత్స్యగిరి, మర్రిపెళ్లి చంద్రయ్య, జిల్లా నాయకులు ఫైళ్ల దయాకర్ రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు ఫైళ్ల వెంకటరెడ్డి, మెరుగు యాదగిరి, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు సింగిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు పబ్బు ప్రవీణ్, పబ్బు బుచ్చిరాములు, బొడిగే వీరయ్య, గనగాని నర్సింహ, పులగం వెంకట్ రెడ్డి, కొంపల్లి అంజయ్య, ఎం.రాజు, నారాయణ, ఎం.రమేష్ పాల్గొన్నారు.