Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటి రెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టమని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అద్యక్షులు చంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బీజీఆర్ ఫంక్షన్ హాల్లో ఆ సంఘం మండల మహాసభ నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభకు ముందుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిండని విమర్శించారు. కార్మికులు ఐక్య పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోగలమని భవిష్యత్ పోరాటాలకు కార్మికులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిసెంబర్ 7వ తేదీన భువనగిరి పట్టణ కేంద్రంలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలకు శ్రీసాయి మెటల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనయన్ తరుపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పగిళ్ళ లింగారెడ్డి , సీఐటీయూమండల కన్వీనర్ మంచాల మధు. సంఘం మండల అద్యక్షులు కొమ్ము ఉషయ్యా, శ్రీసాయి మెటల్ ,సూపర్ ఫైన్ సండ్ ప్రవేట్ లింటెడ్ యూనియన్ నాయకులు అంజి, గణేష్, నరసింహ, నాయకులు జయమ్మ , శంకరయ్య, సతయ్యా, వెంకటేష్, లింగస్వామి, మల్లయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.