Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- రామన్నపేట
టీఆర్ఎస్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సూరారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే జెండా, ఎజెండాలు లేకుండా ఏకపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, పార్టీ గ్రామ శాఖ జింకల మల్లేష్, ఎంపీపీ జ్యోతి, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, సర్పంచులు పోలె బోయిన అండాలు, గుత్తా నరసింహారెడ్డి, కోళ్ల స్వామి, సోమయ్య, ఎంపీటీసీిలు దోమల సతీష్, తిమ్మాపురం మహేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఆమేర్, మాజీ ఎంపీపీ నీల దయాకర్, తదితరులు పాల్గొన్నారు.