Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోదాడరూరల్
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందమల్ల సుధాకర్ కోరారు. ఆదివారం పట్టణంలోని పెరిక హాస్టల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి ప్రజల్లోకి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డిసెంబర్ 18న కోదాడలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క ఆర్ట్టీఐ కార్యకర్త హాజరై సమావేశాల విజయాంతం చేయాలన్నారు. ఆర్టీఐ సందేహాలను , సొసైటీ మేనిఫెస్టో అమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక ఆర్టీఐ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వంగవీటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బత్తిని నాగేశ్వరరావు జిల్లా ఆర్గనైజర్ గోవింద నవీన్, రాంబాబు,శేఖర్, శ్రీనివాస్,పరుశురాం, మట్టయ్య, గోపాల కృష్ణ,గోపి,వేలిశాల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.