Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ- కోదాడరూరల్
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో క్రీడా మైదానాలు జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. ఈ క్రీడా పోటీల్లో పోలీసు జట్టు కూడా పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,ఎంపీపీ కవిత రాధారెడ్డి , వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్,ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరావు, కౌన్సిలర్లు మైస రమేష్,, గుండెల సూరి, మెదరా లలిత,కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, సాదిక్,ఒంటిపులి రమ శ్రీనివాస్, కాజా, టీఆర్ఎస్ నాయకులు అంజన్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్ గౌడ్, బత్తుల ఉపేందర్,వంశీ, నిర్వాహకులు లాజర్ రమేశ్, భరత్,పెనుగంటి మహేష్ పాల్గొన్నారు.
కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికకు ప్రతీకలు
కార్తీక మాస వన భోజనాలు ఆధాత్మికతకు ప్రతీకలు అని అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్లి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీ ఆధ్వర్యంలో కొమరబండ శివార్లలో గల మామిడి తోటలో ఏర్పాటు చేసిన సామూహిక వన భోజనాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సామూహిక వనభోజన కార్యక్రమాల తో ఐకమత్యం పెంపొందుతాయన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,టీిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి రామారావు, వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ రహీం,నాయకులు నవీన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కాలనీ వనభోజనాల కమిటీ సభ్యులు శివశంకర్ రెడ్డి, ప్రవీణ్ ,కందిబండ వెంకటేశ్వరరావు, శాస్త్రి ,శ్రీను, బాబ్ను, ఖాదర్ బాషా, సత్యనారాయణ, నరేందర్, వీరారెడ్డిి, వంగవీటి సత్తి తదితరులు పాల్గొన్నారు.