Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోడిగుడ్డుధర ఏడు రూపాయలు..
- మధ్యాహ్న భోజనానికి భారమైన గుడ్డు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం కోసం అన్ని రకాల పౌష్టికాలు ఉన్న కోడిగుడు ధర రోజురోజుకు పైపైకి వెళ్తుంది. ప్రస్తుతం కోడుగుడ్డు కాస్త కొండ ఎక్కి కూర్చున్నట్లు కనిపిస్తుంది. గత నెల రూ.5, ఈనెల మొదట్లో ఆరు రూపాయలు ఉన్న గుడ్డు కాస్త ఆదివారం ఏడు రూపాయలకు ఎగబాగింది. హోల్ సేల్ షాప్‌లో సైతం ఒక ట్రే గుడ్లు రూ .170 అమ్మకం జరిపారు. సండే టూ మండే రోజు ఖావో అండే . అన్న నానుడి పేద మధ్యతరగతి వారికి భారంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫార్మ్ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న దాన, ఫీడ్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇతర ప్రాంతాల్లో కోడిగుడ్డుకున్న డిమాండ్‌తో కోడిగుడ్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో కోడిగుడ్ల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనానికి .. భారమైన గుడ్డు..!
బడి బయట పిల్లల శాతాన్ని తగ్గించి డ్రాప్ ఔట్స్‌ను నివారిస్తూ ప్రభుత్వ పాఠశాలను బలవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో వారానికి రెండు రోజులు కోడి గుడ్డు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కొక్క పిల్లవాడికి ఒక గుడ్డు ధర ఐదు రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు వారానికి రెండుసార్లు భోజనంతో పాటు ఉడకబెట్టిన గుడ్లను అందిస్తున్నారు. గుడ్ల ధర కాస్త రోజు రోజుకు పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కోడిగుడ్లు అందించడం భారంగా మారింది. ఏజెన్సీలు నడపడం మావల్ల కాదంటూ మధ్యాహ్న భోజన కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు, నెలల తరబడి బిల్లులు పెండింగ్ మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పెట్టుబడులు పెట్టి నెలల తరబడి బిల్లుల కోసం ఎదురుచూసి పెరుగుతున్న ధరలతో అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.