Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
మండలపరిధిలోని వర్కట్పల్లి గ్రామంలో 223 సర్వే నెంబర్ నుండి మొదలుకొని గ్రామ చివర వరకు రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఆర్ఐ, మండల సర్వేయర్లను సోమవారం భూ నిర్వాసితులు అడ్డుకొని అనంతరం ఆందోళన నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ల కోసం గతంలో చేసిన అలైన్మెంట్ను మార్చి తిరిగి చిన్న సన్నకారు రైతుల భూముల పై నుండి రీ సర్వే చేసి వారి భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. వెంటనే పాత పద్ధతిలోనే అలైన్మెంట్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ డివిజన్ నాయకులు నాగేల్లి సత్యనారాయణ, మాడుగుల యాదగిరి, రైతులు సోలిపురం జనార్దన్ రెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,నాగేల్లి దశరథ,బంగారు నరసింహ,మురళి,నాగేల్లి వెంకటయ్య,టేకు పంచాక్షరమ్మ,నాగేల్లి వెంకటమ్మ,వీసం లలిత,మీసాల పద్మ,బంగారు యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.