Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) మండల నాయకురాలు పొగాకు లీల మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పొగకు లీల భౌతికకాయంపై పార్టీ పట్టణ నాయకులతో కలసి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లీల ఐద్వా ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి అనేక మహిళా సమస్య ఆందోళనల్లో ముందుందన్నారు. పార్టీ నిబద్దత గలిగిన కార్యకర్తగా కడవరకు నిలిచిందన్నారు. కుటుంబానికి ఆ పార్టీశాఖ నుండి రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి వెంకట్ రెడ్డి, పట్టణ కార్యదర్శి గాదె నరేందర్, నాయకులు కందుల హనుమంతు, బావండ్లపల్లి బాలరాజు, గొరిగె సోములు, బావండ్లపల్లి సత్యం, కుందూరు వెంకటేశం, పిట్టల శ్రీనివాస్, మునికుంట్ల లెనిన్, రాసాల రమేష్, నకిరెకంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.