Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
వడ్డెరలను బీసీ జాబితా నుండి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో సంఘం నాయకులతో కలిసి ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వడ్డెర కార్పొరేషన్‌కు వేయి కోట్ల నిధులు ఇవ్వాలని, చదువుకునేందుకు ప్రతి వడ్డెర విద్యార్థికి గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. వడ్డెర కమ్యూనిటీ హాల్‌ను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోదాసు వెంకటేశం, మండల అధ్యక్షులు బోదాసు నర్సింహా, వెంకన్న, శ్రీనివాస్, గండికోట రామరాజు, ముత్యాలు, కృష్ణ, వెంకటేశ్, యాదగిరి, శ్రీను, వీరయ్య, పవన్ పాల్గొన్నారు.