Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షునిగా యాదగిరి
- 32 మంది సభ్యులతో నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-మోత్కూర్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బొల్లు యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు నర్సింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 26, 27 తేదీల్లో మోత్కూర్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభల్లో 32 మందితో నూతన జిల్లా కమిటీని మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జెల్లెల్ల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ , జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య, సహాయ కార్యదర్శులుగా సల్లూరి కుమార్, గుంటూరు శ్రీనివాసచారి, సిర్పంగి స్వామి, కూకుట్ల చొక్కాకుమారితో పాటు మరో 21 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారని ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో ఐదు మండలాల్లో భూ పంపిణీపై నిషేధం ఎత్తివేసి ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంపిణీ చేసి పాస్ బుక్కులు ఇవ్వాలని, పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువలకు తీసుకున్న భూములకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసి రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 17 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని, అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్యం అందించాలని కోరారు. ఉపాధిహామీ చట్టాన్ని పరిరక్షించి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, మున్సిపాలిటీల్లో ఉపాధి పనులను కల్పించాలన్నారు. రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా కూలీ, భూమి, ఉపాధి, సామాజిక సమస్యలపై పోరాటాలు ఉధతం చేస్తామన్నారు. మహాసభలో అంశాలన్నింటిని చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు.