Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేస్తూ సోమవారం పట్టణకేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి హాజరై మాట్లాడారు. చౌటుప్పల్‌లో తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, నాయకులు తిరుపతి రవీందర్, సుర్వి నర్సింహాగౌడ్, ముప్పిడి సైదులుగౌడ్, మల్కాపురం నర్సింహా, లందగిరి భీమయ్య, రాచకొండ భార్గవ్, ఊదరి శ్యామ్, బోయ దేవేందర్, చెరుకు లింగస్వామిగౌడ్, చామకూర రాజయ్య, ఊదరి శ్రీను, రాజు, శివ, అంతటి వెంకటేశ్, ఎర్ర గౌతమ్ పాల్గొన్నారు.