Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
విద్యార్థులు శాస్త్రీయతభావాలను పెంచుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో జాగృతి డిగ్రీ కళాశాల ఆడి టోరియంలో చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం అనే అంశంపైన వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయత మైనటువంటి ఆలోచ నలను పెంచకుండా మూఢత్వ భావాలను పెంచే విధంగా ప్రభుత్వాలు విద్యలోకి చొప్పిస్తు న్నాయ న్నారు. అధ్యయనంలో వచ్చే సమస్యల పైన కూడా విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాల మీద విద్యార్థులు రాజలేని పోరాటాలు చేయాలన్నారు. విద్యార్థులంతా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయులను, శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఈర్ల రాహుల్, చింతల శివ, పట్టణ నాయకులు ఈర్ల కార్తీక్ సాయికుమార్ రమణ వెంకట్ సురేష్‌లు పాల్గొన్నారు.