Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
అన్వితా రెడ్డి సాధించిన విజయాలు మన జిల్లాకే గర్వకారణమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భువనగిరి జిల్లాకు చెందిన పడమటి అన్వితా రెడ్డి, కోచ్ బచినేపల్లి శేఖర్ బాబును సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్దదైన ఎవరెస్టు శిఖరంతో పాటు మరో ఆరు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డిని అభినందించారు. అన్వితారెడ్డి సాధించిన విజయాలు యువతకు ఆదర్శమని, ఆమె సాధించిన విజయాలు భువనగిరి జిల్లాకే గర్వకారణమని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఆమె నిరూపించారన్నారు. అన్వితారెడ్డి సాధించిన విజయాలకు వెన్నుతట్టి ప్రోత్సహించిన వారితల్లి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.వచ్చే డిసెంబర్లో విన్సన్ పర్వతారోహణకు వెళుతున్న అన్వితా రెడ్డికి ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలో కూడా రాక్ క్లైమింగ్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు సహకరించి తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. పడమటి అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరంతోపాటు మానస్ లూ, మౌంట్ ఎల్ .బ్రోస్, రెనోక్, బిసి రారు, ఖడి పర్వతాలను అధిరోహించారు. ఏడు ఖండాలలో ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాలలో ఇప్పటికే ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వర చారి, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో 9 ఫిర్యాదులను ఆమె ప్రజల నుండి అందుకున్నారు. రెవిన్యూ శాఖ 8, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఒకటి ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.