Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్ కౌర్
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
దేశంలో ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగానే ప్రధాని మోడీ పాలన కొనసాగుతుందని ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్ కౌర్ అన్నారు. యాదగిరి గుట్ట లో జరుగుతున్న ఏఐటియుసి రాష్ట మహసభ సందర్బంగా జరిగిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై దాడితోపాటు దేశ సంపదను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రక్రియ వేగవంతం అయ్యిందన్నారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందని విమర్శించారు.కార్మికులకు గత 15 సంవత్సరాల నుండి బ్రిటిష్ కాలం లో పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను పూర్తిగా రద్దు చేసి వాటిలో ఉన్న కార్మికులకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను తొలగించి వాటి స్థానంలో కార్మిక లకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చారన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా చేసే విధంగా కాల పరిమితితో కూడిన ఉద్యోగులను నియమించుకునే విధంగా ఇండిస్టియల్ ఎంప్లాయిమెంట్ చట్టం 1946 సవరించారని తెలిపారు.ప్రస్తుత ప్రధాని కార్మిక వ్యతిరేక విధానమే కాకుండా దేశాన్ని అమ్మే విధంగా నిర్ణయాలు చేపడుతున్నారన్నారు.ముందుగా మహాసభలు రెండో రోజు ప్రారంభం లోఏఐటియుసి జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు సంఘం జెండాను ఆవిష్కరించారు ఈ సమావేశంలో జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఎస్ బోస్,అధ్యక్షులు ఎస్ బాలరాజు ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్ ,ఆహ్వాన సంఘం చైర్మన్ గోదా శ్రీరాములు ,ఏఐటియుసి నాయకులు గోరేటి రాములు ఎండి ఇమ్రాన్ ,సత్యనారాయణ ,యానాల దామోదర్ రెడ్డి ,కళ్ళెం కృష్ణ బండి జంగమ్మ ,కొల్లూరు రాజయ్య ,ఏషాల అశోక్ ,చెక్క వెంకటేష్ ,బబ్బురి శ్రీధర్ పేరబోయిన మహేందర్ ,జిల్లా జానకి రాములు ,పెంటయ్య బంగారు రాజు పాల్గొన్నారు.