Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాని వెంటనే అరెస్టు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి లోని బహార్ పేట కాలనీలో ఐద్వా ఆధ్వర్యంలో రాందేవ్ బాబా దిష్టిబొమ్మను దగ్ధం చేసి, మాట్లాడారు. మత ఉద్దారకులు అని చెబుతూ, మహిళలపై వస్త్రధారణ పై అసభ్య వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఆడవాళ్లపై కనీస గౌరవం లేకుండా ఆడవాళ్లు కనీస బట్టలు లేకపోయినా బాగుండాలని వాక్యానించారని, ఆర్ ఎస్ ఎస్, బిజెపి హీన సంస్కృతిని తెలియజేస్తారని వెంటనే రాందేవ్ బాబా ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాబాల ముసుగులో వారి అసభ్యకర భావజాలం ఈ విధంగా బయటపడింది అన్నారు. ఆ సభలో ఉన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవిస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు శ్రీనాథ్ షిండే అక్కడే ఉన్న ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు గాని ఏ ఒక్కరు తప్పని ఖండించలేదని, బిజెపి భావజాలం మహిళల పట్ల ఏ విధంగా ఉందో తెలుస్తుంది అన్నారు. బాబాల పేరుతో ప్రవచన కారుల పేరుతో మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, మహిళలు చెప్పు దెబ్బలు కొడతారని హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, సభ్యులు విజయ, బి యాదమ్మ, బి కల్పన, కే లక్ష్మి, కళ్యాణి ,బేగం, రజిత లు పాల్గొన్నారు.