Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చౌటుప్పల్రూరల్
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న సేవలు అభినంద నీయమని జై కేసారం గ్రామ సర్పంచ్ కొర్పూరి సైదులు, ఎంపీటీసీ మం దుల శ్రీశైలంలు అన్నారు. చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దివిస్ పరిశ్రమ సహకారంతో రూ.19.18లక్షలతో అదనపు తరగతుల గదుల నిర్మా ణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడానికి కూడా దివిస్ పరిశ్రమ సహకారం అందిస్తుందని తెలిపారు. నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు అందిస్తూ విద్యార్థులకు తోడ్పాటు ఉండడం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడు సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బండమీది యమునా యాదగిరి, వార్డు సభ్యులు శేఖర్, పోలోజు శారదా బిక్షమాచారి, ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, మల్లేష్, దివిస్ సిఎస్ ఆర్ ఇన్చార్జ్ వల్లూరి వెంకటరాజు, ఎస్. సాయి కృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.