Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల కంటే వారి బలం తక్కువ
- మతం పేరుతో ఉద్రిక్తలు సృష్టించడమే వారి విధానం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
తెలంగాణ రాష్ట్రంలోబీజేపీఅధికారంలోకి రావాలని పగటి కలలు కంటుందని వారికి కమ్యూనిస్టులతో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువ బలం ఉందని రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో బీజేపీ కమ్యూనిస్టులతో కూడా పోటీ పడలేదని అటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కల్లా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాంబశివరావు అన్నారు.మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాముడు పేరుతో,మతం పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీికి అలవాటుగా ఉంద న్నారు.దేశం మరో శ్రీలంకల మారే పరిస్థితి దాపురించిందన్నారు.స్వతంత్రం వచ్చాక ఇంత అసమానతలు ఎప్పుడూ కనపడలేదు అన్నారు.అసమానతలలో దేశం ప్రపంచంలోనే120 స్థానంలో,ఆకలి సూచికలో నూట ఏడవ స్థానంలో నిరుద్యోగంలో 100శాతం పై స్థానాల్లో భారతదేశం ఉండడం దౌర్భాగ్యం అన్నారు.దక్షిణాఫ్రికా,పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా ఆకలి సూచీలో మనకంటే బెటర్ గా ఉన్నాయని వివరించారు .మాటల ద్వారా దేశాన్ని పక్కదారి పట్టించడం ప్రధాని మోడీకి అలవాటుగా మారిందన్నారు.ఆదాని అంబానీ లా మేలే ద్యేయంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని విమర్శించారు. దేశ సంపద ఒక శాతం ఉన్నకార్పొరేట్ శక్తుల వద్ద 70 నుండి 80 శాతం వరకు ఉందన్నారు .కరోనా సమయంలో పేదలు ఆకలితో అలమటిస్తే అదాని ఆదాయం భారీగా పెరిగిందన్నారు. దేశంలో ప్రజలకు మినిమం గ్యారంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలతోనే సంతృప్తి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విధానాల వల్లే ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు దేశంలో 400 పబ్లిక్ సెక్టార్లు ఉంటే అన్నింటిని ప్రయివేటుపరం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మోడీ ప్రయత్నం చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని అయినా ఆర్టీసీ కాంట్రాక్టు పర్మినెంట్ పోడు భూముల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గ కమిటీలు వేస్తామని వివరించారు. బీజేపీ నిలువరించే వారితోనే కచ్చితంగా సీపీఐ పోత్తు ఉంటుందన్నారు. కామన్ అజెండాలో భాగంగానే టీఆర్ఎస్తో పోత్తు కొనసాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహయకార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి , సత్యనారాయణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ ,చెక్కా వెంకటేష్ ,కళ్లేం కృష్ణ, గోరేటి రాములు ,బండి జంగమ్మ ,జిల్లా నాయకులు పాశికంటి లక్ష్మీ నర్సయ్య, గోరేటి రాములు, శ్రీధర్ పేరబోయిన మహేందర్ ,రేగు సిద్దయ్య ,బబ్బూరి నాగయ్య ,పేరబోయిన పెంటయ్య ,జిల్లా జానకి రాములు ,గాదగాని మాణిక్యం ,చిగుర్ల లింగం ,గోపగాని రాజు ,పేరబోయిన బంగారు ,పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
కూనంనేనికి ఘన స్వాగతం
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం మొదటిసారి యాదగిరిగుట్టకు వచ్చిన కూనంనేనిసాంబశివరావుకు పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.సన్నిధి హౌటల్ వద్ద ఆయనకు పూలమాలలు వేసి సీపీిఐ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు . కూనంనేని కూడా స్వయంగా బైక్ నడిపి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.