Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
శ్రమ దోపిడీ నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోందని రైతు సంఘం సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏచూరిగార్డెన్లో (మల్లుస్వరాజ్యం నగర్) మాలిపురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మంగళవారం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.75 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో పాలకుల విధానాలతో రైతులు పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వాల వైఫల్యాలతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కారుచౌకగా కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో బీజేపీ నిర్వహించిన 400 సభల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చి 8 ఏండ్లయినా రైతుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించి వారికి హక్కుదారు పట్ట బుక్కులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రైతుబంధు రైతు బీమా లను వర్తింపచేయాలని తెలిపారు. ఏకకాలంలో రైతుల రుణమాఫీలను మాఫీ చేసి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులక అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం లేదని, మార్కెట్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. కేంద్ర దోపిడీని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, రైతు సంఘం మహిళ రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్, అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ మహాసభల్లో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కష్ణన్, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి,ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, గౌరవ అధ్యక్షులు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిశ్రీరామ్నాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్, మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, కున్ రెడ్డి నాగిరెడ్డి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హాషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ,తదితరులు పాల్గొన్నారు.