Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన జాతీయ నాయకులు
- నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
- అరించిచిన ప్రజానాట్యమండలి పాటలు
నవతెలంగాణ -నల్లగొండ
జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మంగళవారం ముగిశాయి. మొదటిరోజు ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుండి దాదాపు 30 వేల మందితో వీధిలో భారీ ర్యాలీ నిర్వహించి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్జీ కళాశాలలో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐకేఎస్ నాయకులు హన్నన్ మొల్లా, విజు కృష్ణన్, సారం పెళ్లి మల్లారెడ్డి తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం, మూడవరోజు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్ మల్లు (స్వరాజ్యం నగర్) మాలి పురుషోత్తం రెడ్డి ,గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో ప్రజా ప్రతినిధుల సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 800 మంది రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో మోడీ ఐఎం లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ నాయకులు చర్చ నిర్వహించారు. జరగబోవు కార్యక్రమాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రైతు సంఘం ఏర్పడి ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలపై నాయకులకు సందేశం చేశారు. అనంతరం 25 జిల్లాలోని 87 మందితో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా మొదటిరోజు ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కోలాటం బృందం, డప్పు చప్పులు విచిత్ర వేషధారణ అలంకరణతో విచిత్ర అడుగులు వేస్తూ భారీ సదస్సు నిర్వహించారు.రెండవ రోజు అయిన సోమవారం, మూడవ రోజు మల్లు స్వరాజ్యం నగర్ మాలి పురుషోత్తం రెడ్డి గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో ప్రజా ప్రతినిధుల మహాసభలో ప్రజానాట్యమండలి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రైతాంగ, కార్మిక, కర్షకులు పోరాటాల ద్వారా సాధించకున్న హక్కుల పట్ల నృత్యం, గేయ కార్యక్రమాలు ఆకర్షితులను చేశాయి.