Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకొని తేది 1-1-2023 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో రేపు బుధవారం నుండి వచ్చే డిసెంబరు 7 వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమంపై విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 3, 4 తేదీలలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలపై ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఓటరు నమోదుకు వచ్చే డిసెంబర్ 8 వ తేదీ ఆఖరు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, కలెక్టరేటు సూపరింటెండెంట్ కె. నాగలక్ష్మి, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.