Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇస్తానన్న రూ.3 లక్షలు వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్యభవన్ భువనగిరిలో జరిగిన భువనగిరి మండల ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము గత ఎనిమిదేండ్లుగా మండలంలో ఏ ఒక్కరికి కూడా ఇండ్లు , స్థలాలు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వకపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెక్కాడితే డొక్కాడని పేదలు సొంత స్థలాలు ఉన్న నిర్మాణం కోసం డబ్బులు లేక ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేసి ఇల్లు లేని పేదలకు ఇవ్వాలని, స్థలాల ఉన్నవారికి 3 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్రామాలలో రోడ్లు, డ్రయినేజీ విద్యుత్ స్తంభాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మండలంలో అనాజిపురం తో పాటు అనేక గ్రామాల్లో పల్లె దావకానలు ఏర్పాటు చేసి డాక్టర్లు మాత్రం నియమించడం లేదన్నారు. రెండు మూడు గ్రామాలు కలిపి ఒక డాక్టర్ ఉండడం వల్ల వ్యవసాయ కూలీలు పేదలు నిరుపేదలు వైద్య పరంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి పల్లె దవఖానలో ఒక డాక్టర్ను సిబ్బందిని నియమించాల,ని అన్ని రకాల జబ్బులకు మందులు అందించాలని ప్రభుత్వాన్ని నర్సింహ డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరు మల్లేష్ అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి పాల్గొన్నారు.