Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
కార్మికులు ఐక్య పోరాటాల ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వం మెడలు వంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆసంఘం పట్టణ,మండల 10 వ మహాసభ స్థానిక వేదాద్రి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎనిమిది గంటల పని కోరకు కోట్లాడి సాధించుకుంటె మోడీ ప్రభుత్వం మాత్రం యాజమాన్యాల కోసం అలోచించి కోట్లాది మంది కార్మికుల జీవితాలను చీకట్లో కి నెడుతూ12 గంటల శ్రమ దోపిడీ కి అవకాశం ఇచ్చాడని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చాడన్నారు. రైతులు రైతు వ్యతిరేక చట్టాలపై సంవత్సర కాలం పోరాడి విజయం సాధించారని ఆ పోరాటం స్పూర్తితో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభలో కార్మికులకు పిలుపు నిచ్చారు.ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా సుబ్బురు సత్యనారాయణ, పుప్పాల గణేష్, కంబాల స్వామి లు వ్యవహారించగా ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా నాయకులు బబ్బూరి పొశెట్టి,నాయకులు బీమగాని రాములు, ప్రిమీయర్ నాయకులు మంగ వెంకటేశం,ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు గోడ్డెటి యాదగిరి, భవన నిర్మాణ నాయకులు బెజాడీ శ్రీశైలం, హామాలి నాయకులు వీరస్వామి,వివిధ రంగాల కార్మికులు వెంకటయ్య,స్వామి, కిషన్ ,వెంకట్ ,నగేష్ తదితరులు పాల్గొన్నారు.