Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023లో ఆలేరు ఎమ్మెల్యేకు ప్రజలు సినిమా చూపించడం ఖాయం
- చేరికలపై పెట్టిన దృష్టి అభివృద్ధి వైపు పెడితే మంచిది : బీర్ల ఐలయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
2023లో ఆలేరు నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి సినిమా చూపెట్టడం ఖాయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పిసిసి మెంబర్ బీర్ల ఐలయ్య అన్నారు.మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గొంగిడి మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో 50 మందిని దించి బలవంతంగా పార్టీలోకి చేరికలు చేస్తున్నారని ఇప్పటికైనా బలవంతపు చేరికలు ఆపి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని సంవత్సరంలో ఎన్నికలు ఉన్నందున ప్రజలను లోపరచుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ లోని ఎంపీటీసీ కౌన్సిలర్లను నిధుల కోసం అని తీసుకెళ్లి కండువాలు కప్పడం సిగ్గుచేటు అన్నారు .అయినా వారు తిరిగి పార్టీలోకి వచ్చారని మిగతావారు కూడా తిరిగి వస్తారని తెలిపారు .ఆలేరు ప్రజల మద్దతు కూడగట్టుకోలేకనే టీిఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనుకుంటే ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు రాజకీయం చేయాలంటే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున అభివృద్ధిని చేసి చూపించి ముందుకెళ్లాలన్నారు.కుటుంబాలను మధ్య చిచ్చుపెట్టే విధంగా చేరికలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార దూరాంకారానికి తాము భయపడేది లేదని ఆలేర్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట అన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎనిమిది మండలాల్లో మండల కమిటీ గ్రామ శాఖ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో యాదగిరిగుట్ట ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం,గందమల్ల అశోక్, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్ ,బిట్టు సరోజ హరిష్ ,కాంగ్రెస్ నాయకులు బాలరాజు వెంకటేశ్వరరాజు ,బత్తినిఆనంద్ ,బొజ్జ సాంబేష్ ,ముఖ్యర్ల వెంకటేష్,గుడ్ల నరేష్ గుండ్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు.