Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోత్కూరు
బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ అన్నారు. మోత్కూరు మండలం పాటిమట్ల, దాచారం, సదర్శాపురం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బూత్ కమిటీలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. పాటిమట్ల గ్రామశాఖ అధ్యక్షుడు బండి రాజు తండ్రి అవిలయ్య ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబానికి రూ.5 వేలు, దాచారంలో కడమంచి యాదగిరి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీనరసింహారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, సర్పంచ్ దండెబోయిన మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు గనగాని రాజేష్, మాజీ అధ్యక్షుడు దొండ పవన్, నాయకులు గనగాని యాదగిరి, బూడిద ప్రవీణ్, రచ్చ సంజీవరెడ్డి, బండ సంజీవరెడ్డి, కురుమేటిఅంజయ్య, రచ్చ రవీందర్ రెడ్డి, బండ రాంరెడ్డి, దొండ సత్తయ్య, కురుమేటి గోవర్ధన్, కురిమేటి సైదులు, కురుమేటి రాజు పాల్గొన్నారు.