Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
డిసెంబర్ 7న భువనగిరి ఎఆర్గార్డెన్స్లో సీఐటీయూ జిల్లా 3వ మహాసభలు జరుగనున్నాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం రోజున స్థానిక మార్కెట్ యార్డ్ లో జరిగిన బీసీడబ్ల్యుయూ మండల కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త జల్లా ఏర్పడి ఆరేళ్ళు పూర్తయినా జిల్లాకు డిసిఎల్ ఆఫీసును ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. క్లెయిమ్స్ కూడా డిసిఎల్ ఆఫీసు లేకపోవడం వల్ల సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లాకు డిసిఎల్ ఆఫీసును ఏర్పాటుచేసి సరిపడు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీడబ్ల్యుయూ మండల అధ్యక్షులు సింగారం వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాధారపు మల్లేశం, నాయకులు చుక్క రాంచంద్రం, ఉక్కుర్తి స్వామి, మల్గ కుమార్, చేగూరి నగేష్, రాధారపు నర్సింహ, దొడ్డి మురళి, వలమాల శ్రీను, గందమల్ల సత్యనారాయణ, మొగిలిపాక జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.