Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
డిసెంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరుగుతున్న ఎన్పీఆర్డీ జాతీయ మహాసభల పోస్టర్ను మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకొని ఆత్మగౌరవం తో బతకాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు యస్. సురుపంగా ప్రకాష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ,జిల్లా కోశాధికారి బోల్లేపల్లి స్వామి, మహిళా కన్వీనర్ కొత్త లలిత, సాంస్కృతిక విభాగం రాష్త్ర నాయకులు కటాకమోజు ఆంజన శ్రీ, జిల్లా నాయకులు జోకు స్వామి, కేతావత్ మురళి నాయక్, గోపి పాల్గొన్నారు.