Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
అంజనీ లైమ్‌స్టోన్‌లో గనుల పర్యావరణ, ఖనిజసంరక్షణ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నాయని మైన్స్ మేనేజర్ రాంబాబు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలకేంద్రంలోని అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్‌కు చెందిన, అంజనీ లైమ్‌స్టోన్ గని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుండి వచ్చే నెల 3 వరకు నిర్వహించబడుతున్న 28వ గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ లో సందర్భంగా తనిఖీ చేయడానికి ఆడిట్ బృందం వచ్చిందన్నారు.అందులో భాగంగా గనుల ఆవరణలో మొక్కలు నాటామన్నారు.అనంతరం గనుల సమావేశ ప్రాంగణంలో 'పర్యావరణ వ్యవస్థ, పునరుద్ధరణ'అనే అంశంపై వ్యాసరచన, నినాదాలు, పోస్టర్లలో గెలుపొందిన అంజనీ ఉద్యోగులకు, సీత మెమోరియల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఇండియా సిమెంట్స్ డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్రావు యర్రగుంట్ల, శ్రీ జయజ్యోతి సిమెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.దేవేంద్రన్ బనగానపల్లి, అంజని పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్‌కు సంబంధించిన వివిధ శాఖల విభాగాధిపతులు, అంజనీ ఉద్యోగులు, సీతా మెమోరియల్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.