Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్హేమంత్కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డుతో పాటు తమ మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని, అలాగే ఆధార్ డేటాను నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ పాటిల్‌హేమంత్ కేశవ్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా ప్రజలందరూ ఆధార్‌కార్డుకు మొబైల్ నెంబర్‌ను అను సంధానం చేసుకోవాలన్నారు.అలాగే బర్త్ రిజిస్ట్రేషన్ కూడా ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి పథకాల పౌర సేవలు పొందాలను కునేవారు ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2016 కంటే ముందుగా ఆధార్గుర్తింపు కార్డు పొందినవారు యూఐడీఏ ఆదేశాల మేరకు సంబంధిత పత్రాలతో మీసేవా కేంద్రాలలో సంప్రదించాలన్నారు.ఈ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని మీసేవ ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇక్బాల్‌ను ఆదేశించారు.వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్ ,సిమ్ కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు.మీ సేవకు ఇచ్చిన ఆధార్సెంటర్ను వారికి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలలో మాత్రమే ఆధార అనుసంధానం ప్రక్రియ చేయాలని ఆదేశించారు.ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఆధార్ కు అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, ఆర్డీవోలు కిషోర్‌కుమార్, రాజేంద్రకుమార్, వెంకరెడ్డి, డీడబ్ల్యూఒ జ్యోతిపద్మ, డీఎస్పీ నాగభూషణం, ఆధార్ రీజినల్ సెక్షన్ ఆఫీసర్ పీఎన్వీఆర్ కృష్ణ, అకౌంట్ ఆఫీసర్ వినరు,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.