Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
క్రీడల్లో రాణింపుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కట్టాకొమ్ముగూడెం రోడ్డులో కెేసీఎల్ ఆధ్వర్యంలో 2020 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు.క్రీడాకారులు గెలు పోటములను సహజంగా తీసుకోవాలన్నారు. క్రీడాస్ఫూర్తిని పెంచుకొని క్రీడల్లో రాణించాలన్నారు.ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.క్రీడల్లో రాణిస్తూ భవిష్యత్ తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలన్నారు.ఇటువంటి టోర్నమెంట్లు క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడానికి దోహదపడతాయన్నారు.ప్రతిభ గల క్రీడాకారులకు తన వంతు సహకారం ఉంటుందన్నారు.కాగా ప్రథమ బహుమతి త్రిలోక్ స్టైకర్స్ ,ద్వితీయ బహుమతి ఎమ్మెస్సార్ వారియర్స్,తృతీయ బహుమతి బెజవాడ బుల్స్ కైవసం చేసుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు అంజన్గౌడ్, గ్రంథాలయ చైర్మెన్ రహీం, గంధం పాండు, కందుల మధు, బత్తులఉపేందర్,పిట్టలభాగ్యమ్మ, వంశీ నాని,నిర్వాహకులు లాజర్, భరత్, స్టాలిన్రాజ్, ఉపేందర్, పెనుగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.