Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు
- రూ.133 కోట్లతో టూరిజం స్పాట్
- వార్డుల్లో పనుల కోసం వారంలో టెండర్లు
- మున్సిపల్ అత్యవసర సమావేశంలో చైర్మెన్ మందడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండను ప్రథమ స్థానంలో నిలపడమే తమ ధ్యేయం అని మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమావేశంలో వెల్లడించారు. నల్లగొండ పట్టణంలో 700 కోట్ల రూపాయలతో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పానగల్ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని, మరో వారం రోజుల్లో 48 కోట్ల రూపాయలతో మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనునట్లు తెలిపారు. అదేవిధంగా మిర్యాలగూడ రోడ్డులోని జిఎల్ గార్డెన్ నుండి పాతబస్తీ లోని పూల వరకు 80 ఫీట్ల రోడ్డును ఆధునికరిస్తున్నట్లు పేర్కొన్నారు.పట్టణం మొత్తం రోడ్డుల విస్తరణ, జంక్షన్ల ఆధునికరణ, పాతబస్తీ ఆధునీకరణ, తోపాటు 4,6 లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్ తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అంతే కాకుండా 133 కోట్ల రూపాయలతోటి ఉదయ సముద్రం టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 90 కోట్ల రూపాయల తోటి కళాభారతి ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వార్డుల అభివద్ధి కోసం 100 కోట్ల రూపాయలు అవసరం కాగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఎలక్షన్స్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవగా రెండు విడతలుగా నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో టెండర్లను పిలవనున్నట్లు తెలిపారు. అన్ని పనులు సకాలంలో పూర్తిచేసి నల్లగొండను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దరున్నట్లు వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ముసాద్ అహ్మద్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.