Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గుండాల
ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి సారిస్తే ఆర్థికాభివృద్ధిలో మేలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యాన,వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని,ప్రత్యేక అధికారులతో రైతులకు అవగాహన కార్యక్రమంలో సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి లోగా మొక్కలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామని,ఆసక్తి గల రైతులు ఫీల్డ్ ఆఫీసర్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్,జిల్లా పట్టు,ఉద్యానవన శాఖ అధికారిణి అన్నపూర్ణ,ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్లు,రైతు బందు కన్వీనర్ గడ్డమీది పాండరి గౌడ్, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి లావణ్య, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దార సైదులు, బొంగు శ్రీశైలం, సర్పంచ్లు మొసలి విజితా రమేష్ రెడ్డి,యాస భాషిరెడ్డి,అబ్బులు,రేఖా యాదగిరి లతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడరేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.