Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందల మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆలేరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు ముదిగొండ శ్రీకాంత్ ,సంతోష్ ,బింగి గణేష్ ,చిట్టిమల్ల వెంకటేష్ లతో సహా సుమారు 300 మంది టీిఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పాలన ఉన్న రాష్ట్రాలు కూడా పింఛన్ రూ.1000 కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో మాత్రం రూ.2016 పింఛన్ ఇస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు .రాబోయే రోజుల్లో కూడా అన్ని గ్రామాల నుండి టీఆర్ఎస్లోకి చేరేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ,ఆలేరు మున్సిపల్ చైర్మెన్వస్పర్ శంకరరు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ ,సెక్రటరీ జనరల్ కుండే సంపత్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ,గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ ఆడేపు బాలస్వామి,ఆర్టిఏ జిల్లా డైరెక్టర్ పంతం కృష్ణ ,మాజీ సర్పంచులు చింతకింది మురళి ,దాసి సంతోష్ ,కౌన్సిలర్లు బేతి రాములు ,నర్సింలు ,నాయకులు సీసా మహేశ్వరి ,పూల శ్రవణ్ ,ఖడ్గం సిద్దిరాజు ,పత్తి వెంకటేష్ పాల్గొన్నారు.