Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మున్సిపల్ కేంద్రంలో 100 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలో టీయూఎఫ్ఐడీసీ నిధులతో డివైడర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, దీంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ సి.శ్రీకాంత్ తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు కిరువైపులా 50 ఫీట్ల చొప్పున 100 ఫీట్ల రోడ్డు నిర్మించాల్సి ఉందని, ట్రాఫిక్, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 100 ఫీట్ల రోడ్డు వెడల్పుకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న యజమానులు ఎంతమేర ఇళ్లను కోల్పోతున్నారో చూసుకుని తొలగించుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కారుపోతుల శిరీష, ఎర్రబెల్లి మల్లమ్మ, లెంకల సుజాత, మలిపెద్ది రజిత, వనం స్వామి, దబ్బేటి విజయ, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, గుర్రం కవిత, కూరెళ్ల కుమారస్వామి, కోఆప్షన్ సభ్యులు గనగాని నర్సింహ, పోలినేని ఆనందమ్మ, ఎండి.షాహిన్ సుల్తానా, ఎండి.నబీ పాల్గొన్నారు.