Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,ఎంపీ మాలోత్ కవిత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పాదయాత్ర పేరుతో ప్రజల మధ్య వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మాలోత్ కవిత అన్నారు. బుధవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో విష నాగులు తిరుగుతున్నాయన్నారు. షర్మిళ ప్రస్థానం ఎటు వైపు...ఏ లక్ష్యంతో మీరు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు షర్మిలను గౌరవించారన్నారు. షర్మిల వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని చెప్పారు. 2004లోనే టీిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉద్యమాన్ని నీరుగారిచేందుకు కొనుగోలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్ అయితే ఇక్కడ షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తున్నట్లని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, షర్మిల ఎందుకు అడగట్లేదు,ఏపీలో సమస్యలపై షర్మిల స్పందించాలని అన్నారు. షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. నాటి ఆంధ్రా పాలకుల వైఖరిని తెలంగాణలో అనుసరిస్తు న్నారన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటుందన్నారు. దేశంలో అన్ని రంగాల్లో నూ తెలంగాణ అగ్ర స్థానంలో వుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తెలంగాణకు ఇప్పటి వరకు నెరవేర్చలేదని వివరించారు.