Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌటుప్పల్రూరల్
ఈ నెల 26 నుండి 28వ తేదీ హైదరాబాద్లో జరుగుతున్న ఎన్పీఆర్డీఓ అఖిలభారత 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ కోరారు. బుధవారం స్థానికంగా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న అఖిలభారతమహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల సర్పంచ్ చౌట వేణుగోపాల్ ,ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ సభ్యులు రాయగిరి యాదయ్య, ఎన్ పి ఆర్ డి కుంట్ల గూడెం గ్రామ అధ్యక్షులు గువ్వల చంద్రకళ, గ్రామ కార్యదర్శి బందెల నరసింహ, నేలపట్ల గ్రామ నాయకులు కడారి బిక్షపతి, కాసోజు గణేష్ చారి ,బెదరకోట లింగస్వామి, తడక ఆంజనేయులు, మందొళ్ళగూడెం గ్రామ నాయకురాలు జి.రమాదేవి, ఎస్ .లింగోటం గ్రామ నాయకురాలు కోడం వనజ, జ కేసారం గ్రామ అధ్యక్షురాలు తూర్పుంటి శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.