Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటిగడ్డ అయిన సూర్యాపేట జిల్లాలో సాయుధ పోరాట స్ఫూర్తి కొనసాగిస్తామని నల్లగొండలో నవంబర్ 27,28,29వ తేదీలలో జరిగిన తెలంగాణ రైతుసంఘం రెండో మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన బుర్రి శ్రీరాములు, దండా వెంకటరెడ్డి అన్నారు.బుధవారం స్థానిక ఎంవీఎన్ భవన్లో వారు మాట్లాడారు.జిల్లాలో ధరణి సమస్యలపై,పోడుభూములు,కౌలు రైతుల సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు.పంటల వారీగా రుణాలు అందించాలని,ఎడమకాలువపై ఉన్న లిఫ్టులను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో పత్తి,మిర్చి కొనుగోలుకేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుర్రి శ్రీరాములు, రాష్ట్ర సహాయకార్యదర్శిగా దండా వెంకటరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా మల్లు నాగార్జునరెడ్డి, కొప్పుల రజిత,కందాల శంకర్‌రెడ్డి,పారేపల్లి శేఖర్‌రావు,పల్లె వెంకటరెడ్డిలు ఎన్నికయ్యారు.