Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
యాదవులంతా ఐక్యంగా ఉండాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ యాదవ్ అన్నారు.బుధవారం మండలకేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు.గొల్ల కుర్మలకు గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలని కోరారు.రూ.6 లక్షల ప్రమాదబీమా కల్పించాలని కోరారు.50 ఏండ్లు నిండిన గొర్రెల కాపరులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.డీడీలు లేకుండా 18 ఏండ్ల నిండిన వారందరికీ రూ.5 లక్షల వరకు నగదుబదిలీ చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ గొర్రెల మేకలపెంపకం దారులసంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షునిగా గుండాల లింగయ్యయాదవ్,ఉపాధ్యక్షులుగా భూతం వీరయ్యయాదy,్ పచ్చిపాల దేవ లింగం, ప్రధాన కార్యదర్శిగా కాడబోయిన మల్లయ్యయాదవ్,సహాయ కార్యదర్శిగా కొమ్ము అశోక్, వల్లపుప్పలయ్య, గౌరవ అధ్యక్షులుగా చెవిటి కొమరయ్య, బోర సోమయ్య, సలహాదారులుగా వల్లపు ఉప్పలయ్య, వీరబోయిన రాములు, గాడ్డుల వెంకన్న, దగ్గుల లింగయ్య,మట్టపల్లి, కర్నాకర్, మల్లయ్య, తోట శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, వీరబోయిన రవి, వజ్జె వినరు, కసనబోయిన లింగయ్య,కొమ్ము అశోక్, దగ్గుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.